
ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ముఖ్యమైన జిల్లాలలో ఒకటి. 2022లో జిల్లాల పునర్విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాను విభజించి ఏలూరును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఏలూరు నగరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. గోదావరి నదీ తీరంలో సస్యశ్యామలమైన ఈ ప్రాంతం వ్యవసాయాధారంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా పత్తి, పొగాకు, మిర్చి, వరి పంటలు ఇక్కడ విస్తారంగా పండుతాయి. ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఏలూరు , దెందులూరు , ఉంగుటూరు , నూజివీడు , కైకలూరు , పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలు విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల మార్పుల్లో మరోసారి ఏలూరు జిల్లా సరికొత్తగా మారబోతోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఏలూరులో కలిసిన కైకలూరు ను తిరిగి బందరు కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలిపేందుకు రెడీ అవుతున్నారు. ఇక నూజివీడు నియోజకవర్గాన్ని ఇప్పటికే విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో కలుపుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలిపేస్తారు. అయితే ఏలూరు జిల్లాలోకి కొత్తగా గోపాలపురం నియోజకవర్గాన్ని కలుపుతారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న గోపాలపురం నియోజకవర్గం లో ద్వారకా తిరుమల మండలం ఒక్కటి ఏలూరు జిల్లాలో ఉంది. మిగిలిన నల్లజర్ల - గోపాలపురం - దేవరపల్లి మూడు మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నియోజకవర్గం అంతా ఏలూరు లో కలిపే ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఏదేమైనా ఏలూరు జిల్లా నుంచి కైకలూరు - నూజివీడు రెండు నియోజకవర్గాలు వెళ్లిపోతుంటే కొత్తగా గోపాలపురం నియోజకవర్గం వచ్చి చేరుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు