
పేద విద్యార్థులకు సరసమైన ధరల్లో విద్య అందుబాటులో ఉండదని, ఫీజులను ఇష్టానుసారం వసూలు చేసే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణ వంటి సంస్థలకు కాలేజీలను అప్పగించే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.కేంద్రం నుంచి నిధులు, అనుమతులు సమకూర్చుకుని కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలో నడపాలని షర్మిలా డిమాండ్ చేశారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె పట్టుబట్టారు. ప్రభుత్వం తమ బాధ్యతను నిర్వర్తించాలని, విద్యను సరసమైనదిగా ఉంచాలని ఆమె కోరారు.కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఒప్పుకోదని షర్మిలా స్పష్టం చేశారు. ప్రైవేటీకరణను కొనసాగిస్తే తీవ్ర ఉద్యమం చేపడతామని ఆమె హెచ్చరించారు. పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె ఒత్తిడి చేశారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు సగటున రెండు లక్షల రూపాయల అప్పు భారం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, ఏటా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయని ఆమె ఆందోళన వెలిబుచ్చారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు