హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా మొదలైన ప్రపంచ తెలుగు మహాసభలు కెసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికోసం ప్రగతి భవన్ లో తెలుగు సాహితీవేత్తల తో కెసిఆర్ ప్రత్యేకంగా సమావేశమై ఈ సభలు యొక్క ఉద్దేశం తెలుగు భాష యొక్క విశిష్టతను ప్రాధాన్యతను ప్రపంచానికి తెలిసేలా నిర్వహించాలని అన్నారు. ఈ సభలకు ప్రపంచంలో ఉన్న తెలుగు భాష ప్రేమికులను, రచయితలు, కవులు అలాగే తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరిని తెలంగాణ ప్రభుత్వం  సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

ఈ సందర్బంగా గాలి ముద్దు కృష్ణమ నాయుడు మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పు చేస్తోంది అని వ్యాఖ్యానించారు. అదేంటంటే తెలుగుభాష యొక్క ప్రాధ్యన్యతను   చాటి  చెప్పేందుకు చెప్పటిన ఈ కార్యక్రమానికి పొరుగు తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని  ఆహ్వానించకపోవడం  బాధాకరమని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రీసెంట్ గా  మీడియా సమావేశంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం తెచ్చిన వీరునిగా కెసిఆర్ ను గౌరవిస్తామని. చంద్రబాబు విషయంలో తెరాస ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తుంది  అని వ్యాఖ్యానించారు. ఇటువంటి కార్యకరమానికి రాజకీయాలకు అతీతంగా రాజకీయనాయకులు వ్యవహరించాలని  గాలి ముద్దు కృష్ణమ నాయుడు సూచించారు.

అయితే చంద్రబాబు ని ఆహ్వానించక పోవడం వెనక కెసిఆర్ పెద్ద ప్లాన్ వేసారు అని అర్ధం అవుతోంది. మొన్న ఇవాంక ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇలాగే లైట్ తీసుకున్నారు కెసిఆర్ దానికి కారణం లేకపోలేదు. చంద్రబాబు ని పిలిచిన దగ్గర నుంచీ ఆయన అనుకూల మీడియా ఆయన్నే హైలైట్ చేసుకుంటూ చూపిస్తుంది అనేది కెసిఆర్ ఆలోచనగా చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: