ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే మాజీ సీఎం చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నాడు.  చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ప్రజా వేదికను కూల్చి మాజీ సీఎం కు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడు.  దీంతో చంద్రబాబు మరో మకాం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 

ఇప్పటివరకు చంద్రబాబు తన నివాసం నుంచి  పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు ఇప్పుడు జగన్ ఎఫెక్టుతో  చంద్రబాబు పార్టీ కార్యకలాపాల కోసం కొత్త వేదిక చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.  అందుకే ఇకనుంచి గుంటూరు టిడిపి ఆఫీస్ నుంచి చంద్రబాబు పార్టీ  వ్యవహారాలు చక్కబెడతారు. 

 

సోమవారం నుంచి గుంటూరు ఆఫీస్ నుంచి టిడిపి కార్యకలపాలు ఉంటాయని ఆ పార్టీ ప్రకటించింది. వారంలో ఐదు రోజుల పాటు పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారట చంద్రబాబు, లోకేష్. నిత్యం కార్యకర్తలకు  బాబు తో పాటు ఇతర నేతలు అందుబాటులో ఉంటారట.

 

ఇక నుంచి తెలుగు దేశం నిత్యం ఏదో ఒక కార్యక్రమం తో ప్రజల లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు అనుగుణంగా గుంటూరు ఆఫీస్ ను సిబ్బంది రెడీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: