ఇదే విషయంలో ఓసారి శ్రీమహాలక్ష్మీ, సరస్వతీదేవిల మధ్యవాదన వచ్చింది. ధనం గొప్పదని శ్రీవైకుంఠ వాసినీ, కాదు విజ్ఞానమ గొప్పదని సృష్ఠికర్త భార్యా తీవ్రస్థాయిలో నొక్కి చెప్పారు. ఆ వివాదం తెగకపోవడంతో పార్వతీదేవినీ సంప్రదించారు. అర్థనారీశ్వరి ఆ సమస్యని పరమశివునికి విన్నవించింది. దానితో ఈశ్వరుడు పిడికెడు విభూదిని ఇచ్చాడు. ఇది పాండిత్యము. దానికి తగ్గ ధనమివ్వమన్నాడు. శ్రీమహాలక్ష్మీ ఆ విభూది బరువుకి మహా ధనరాసులను కురిపించింది. అయినా తూగలేదు. దానితో శ్రీమహాలక్ష్మి జ్ఞానమే గొప్పదని అంగీకరించింది. అప్పుడు చెప్పింది ఆదిలక్ష్మి.... ధనంకన్నా జ్ఞానం గొప్పది. జ్ఞానం కన్నా ధనం గొప్పది. కాని ధనం, జ్ఞానం కలవగలిగితే అంతకు మించిన గొప్పది ఈ పద్నాలుగు భువన భాండల్లో ఏదీ లేదు అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: