
తరువాత వారు కరోనా నుండి కోలుకుని వారి జట్లతో కలిశారు. వారిలో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ కి చెందిన అక్షర్ పటేల్ మరియు బెంగుళూరు రాయల్ ఛాలంజెర్స్ కి చెందిన దేవదత్ పడిక్కల్ ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టోర్నీకి దూరమవుతున్నానని నిన్న హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం ప్రకటించాడు. అశ్విన్ కుటుంబంలో వారికి కరోనా సోకిన కారణంగా టోర్నీ నుండి దూరమవుతున్నానని చెప్పాడు. ఇకపోతే వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న ఆర్సీబి కి ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వారి విజయాల పరంపరకు బ్రేక్ వేసింది. కాగా తాజాగా ఆర్సీబి కి మరో షాక్ తగిలింది.
ఆజట్టులోని కీలక ఆటగాళ్లు ఇద్దరు టోర్నీ మధ్యలోనే నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. వారిద్దరూ కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లే కావడం గమనార్హం. ఒకరు ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్ సన్ కాగా, మరొకరు మిస్టరీ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా. వీరు దీనికి కారణాన్ని చెబుతూ ఇండియాలో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండడంతోనే మేము వెళ్ళిపోతున్నామని తెలిపారు. దీనితో ఆర్సీబికి డబల్ షాక్ తగిలినట్లయింది. ఈ విషయాన్ని ప్రాంచైజీ యాజమాన్యం "వారి నిర్ణయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నామని..వారికి మేమెప్పుడూ మద్దతుగా ఉంటామని ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. దీని వెనుక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీబీ సూచన మేరకే వీరిద్దరూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.