భారత మాజీ  ఆటగాళ్లు హర్భజన్ సింగ్ మరియు జవగల్ శ్రీనాథ్  లు అరుదైన గౌరవం పొందారు. మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (MCC) తాజాగా ప్రకటించిన శాశ్వత సభ్యుల జాబితాలో భారత ఆటగాళ్ళైన హర్భజన్ , జవగల్ శ్రీనాథ్ లకు శాశ్వత సభ్యత్వం కలిపించింది. టెస్ట్ క్రికెట్ ఆడే దాదాపు 12 దేశాలలో ఎనిమిది దేశాల నుండి 18 మంది గౌరవ గౌరవ సభ్యులను ఎన్నిక చేసింది. ఇందులో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం. అయితే హర్భజన్ సింగ్ భరత్ తరుపున 103 మ్యాచ్‌ల్లో 417 వికెట్స్ పడగొట్టిన మూడవ ఆటగాడిగా ఉన్నాడు. అదేవిధంగా హర్భజన్ అన్ని ఫార్మెట్లలో కలిపి 711 వికెట్స్ పడగొట్టాడు. జవగల్ శ్రీనాథ్ మాత్రం  వన్డేల్లో 315 వికెట్లు టెస్టుల్లో 236 వికెట్లు  పడగొట్టి తన బెస్ట్ ఇచ్చాడు.


 ఈ జాబితాలో మెంటల్ స్ట్రెస్ తో క్రికెట్ కు గుడ్ బై చెప్పి మల్లి తిరిగి క్రికెట్ ఆడుతున్న మహిళా క్రికెటర్ మరియు  వికెట్ కీపర్-బ్యాటర్ సారా టేలర్‌ కు ఇందులో సభ్యత్వం  లభించింది. ఈమె రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ, షార్లెట్ ఎడ్వర్డ్స్ కప్ టోర్నీ లకు  ప్రాతినిధ్య వహించింది . దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ నుండి  హషిమ్ ఆమ్లా, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కాలిస్ ఇంకా  మోర్నీ మోర్కెల్ లు ఈ జాబితాలో చోటు సంపాదించారు. అదేవిధంగా వెస్ట్ ఇండీస్ నుండి  రామ్‌నరేష్ సర్వన్ ,ఇయాన్ బిషప్ మరియు శివనారైన్ చంద్రపాల్‌లకు ఈ జాబితాలో చోటు లభించింది.



 ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ బ్లాక్‌వెల్ , డామియన్ మార్టిన్ లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ విషయాన్నీ MCC యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ & సెక్రటరీ గై లావెండర్ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఈ జాబితాను తాను వెల్లడించినందుకు తనకు చాల సంతోషంగా ఉందని చెప్పారు. జాబితాలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు వారివారి దేశాల తరుపున గొప్ప ప్రతిభను చూపించినవారే. వారిని MCC లో  శాశ్వత సభ్యులుగా చేర్చుకోవడం మరియు వారితో కలసి పనిచేయబోతున్నందుకు  సంతోషిస్తున్నాము అని చెప్పారు .


మరింత సమాచారం తెలుసుకోండి: