సౌత్ ఆఫ్రికా పర్యటన ఇండియా కు ఈ సంవత్సరానికి ఒక మచ్చలా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంతో ఉత్సాహంతో మూడు టెస్ట్ లు మరియు మూడు వన్ డే ల సిరీస్ ఆడదానికి సౌత్ ఆఫ్రికా పర్యటనకు వచ్చిన ఇండియా కు అడుగడుగునా అపజయాలు ఎదురువవుతున్నాయి. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను 1-2 తో కోల్పోయి నిరాశలో మునిగిపోయిన టీమ్ ఇండియా, నిన్న రాత్రి ముగిసిన రెండవ వన్ డే లో ఘోరంగా ఓడిపోయి వన్ డే సిరీస్ ను సైతం సఫారీలకు అప్పగించింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇండియా టీమ్ పై విమర్శలు వస్తున్నాయి.

ఈ ఓటమికి కారణాలు ఏవేవో చెప్పుకుంటున్నారు. కానీ ప్రధమంగా ఇండియా కెప్టెన్ గా ఉన్న కె ఎల్ రాహుల్ అసలు కారకుడు అని ఏ కొద్ది మంది మాత్రమే అంటున్నారు. ఏ ఆటలో అయినా ఆటగాళ్లను ముందుండి నడిపించే సారధి విజయానికి అయినా ఓటమికి అయినా కారకుడవుతాడు. ఇప్పుడు ఇక్కడ కూడా రాహుల్ అసలైన కారకుడు అని చెప్పాలి. ఇందుకు కొన్ని కారణాలను ఇక్కడ చెప్పుకుందాం.

మాములుగా అయితే రాహుల్ టీ 20 లేదా వన్ డే జట్టులో ఒక సభ్యుడుగా ఉన్నప్పుడు తనదైన ఆటను ఆడుతూ ఉంటాడు. అంటే చాలా స్వేచ్ఛగా షాట్ లను ఆడుతాడు. అసాధారణమైన రీతిలో బౌలర్ లపై విరుచుకుపడడంలో రాహుల్ తనకు తానే సాటి. కానీ నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాహుల్ మొదటి నుండి నెమ్మదిగానే ఆడుతున్నాడు. ఒకవైపు ధావన్ మరియు పంత్ లు అలవోకగా బౌండరీలు బాదుతుంటే, రాహుల్ మాత్రం  బౌండరీ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. మొత్తానికి ఎక్కువ బంతులు ఆడి అర్ధ సెంచరీ చేసి తన పని ఇక అయిపోయిందన్నట్లు ఒక చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు.

ఇక ఫీల్డింగ్ ను మోహరించడంలోనూ మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. బ్యాట్సమన్ మరియు బౌలర్ కు తగిన విధంగా ఫీల్డ్ సెట్ చెయ్యాలి. కీలకమైన దశలో వికెట్ కోసం బౌలర్ ను మార్చడంలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. భాగస్వామయాన్ని విడదీయడంలో మంచి రికార్డు ఉన్న శార్దూల్ ఠాకూర్ కు ఆఖరి 15 ఓవర్లలో బౌలింగ్ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా రాహుల్ తనకు దక్కిన కెప్టెన్సీ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేక ఆదిలోనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. రేపు జరిగే ఆఖరి వన్ డే లో కెప్టెన్సీ ని మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఏమి జరుగుతుందో చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: