ఇక ఇంత పాపులారిటీ ఉన్న విరాట్ కోహ్లీ గురించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి అది వైరల్ గా మారకుండా ఉంటుందా.. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి ఒక విషయం వైరల్ గా మారిపోయింది. సాధారణంగా విరాట్ కోహ్లీ తన డైట్ విషయంలో ఎంత ఖర్చుతత్వంతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే అతను తాగే వాటర్ కూడా ఎంతో కాస్లీ అన్న విషయం గతంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అతని హెయిర్ స్టైల్ గురించిన చర్చ జరుగుతోంది.
ఇటీవల విరాట్ కోహ్లీ ఒక కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించాడు. అయితే విరాట్ కోహ్లీ హెయిర్ స్టైల్ కి కూడా సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ ఉంది. ఈ క్రమంలోనే కొత్త హెయిర్ స్టైల్ తో కోహ్లీ ఫోటోలకు ఫోజులు ఇవ్వగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఈ హెయిర్ స్టైల్ గురించి చర్చ మొదలైంది. అయితే కోహ్లీ కొత్త హెయిర్ కట్ డిజైన్ కు దాదాపు 80000 ఖర్చు అయ్యాయట. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.అదే హెయిర్ స్టైల్ 100, 150 లో చేయించగలము అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..