విజయ శంకర్.. భారత క్రికెట్ ప్రేక్షకులకు కొంతమందికి ఇక ఈ ఆటగాడి పేరు తెలిసే ఉంటుంది. ఎందుకంటే భారత జట్టు తరఫున కొన్నాళ్లపాటు ప్రాతినిథ్యం వహించాడు విజయ్ శంకర్.. ఇక అతనికి బిసిసిఐ మంచి అవకాశాలు ఇచ్చినప్పటికీ నిరూపించుకోలేకపోయాడు అని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో నిలకడలేమి కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువైన నేపథ్యంలో ఇక చాలా రోజులుగా టీమ్ ఇండియాలో కనిపించకుండా పోయాడు విజయ్ శంకర్ అనే చెప్పాలి. కేవలం ఐపిఎల్ ద్వారా మాత్రమే ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.


 విజయ్ శంకర్ ఆల్రౌండర్ అన్న విషయం తెలిసిందే. ఒకవైపు బ్యాటింగ్లో రాణించడమే కాదు మరోవైపు బౌలింగ్లో కూడా అదరగొడుతూ ఉంటాడు. అయితే ప్రస్తుతం రంజీ ట్రోఫీలో భాగంగా విజయశంకర్ అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు అని చెప్పాలి. తమిళనాడు జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆటగాడు ప్రస్తుతం తన బ్యాటింగ్ విధ్వంశాన్ని కొనసాగిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక అతను బరిలోకి దిగాడు అంటే చాలు సెంచరీ చేయడం ఖాయం అనట్లుగానే ప్రస్తుతం బ్యాటింగ్ ఫామ్ కొనసాగిస్తూ తమిళనాడు జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడని చెప్పాలి.


 ఇలా అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్న విజయ శంకర్ ప్రస్తుతం మూడు సెంచరీలు బాది ఔరా అనిపిస్తున్నాడు. వరుసగా 214 పంతులు 107, 174 బంతుల్లో 103, 187 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇలా ప్రతి మ్యాచ్ లో కూడా ఆరవ నెంబర్ వద్ద బ్యాటింగ్ చేయడానికి వస్తున్న విజయ శంకర్ ఎంతో ఆచితూచి ఆడుతూ ఇక అటు వికెట్ను కాపాడుకుంటూనే సెంచరీల మోత మోగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఫామ్ కొనసాగిస్తే  మళ్ళీ జట్టు లోకి పునరాగమనం చేసే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: