ఇటీవల కాలంలో క్రికెట్లో అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇక ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ఖచ్చితత్వంతో తీసుకోగలుగుతున్నారు. ఇక ఒకప్పుడు ఎల్బీడబ్ల్యు విషయంలో కన్ఫ్యూజన్ నెలకొనేది. ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత ఇక కచ్చితత్వంతో చెక్ చేసేందుకు టెక్నాలజీ అందుబాటులో ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే ఏదైనా నిర్ణయం విషయంలో అంపైర్లకు అనుమానాలు ఉన్నాయి అంటే చాలు థర్డ్ అంపైర్ కు రిఫర్ చేయడం చూస్తూ ఉన్నాం.  దీంతో థర్డ్ అంపైర్లు అన్ని యాంగిల్స్ లో కెమెరాలను చెక్ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనే విషయంపై అసలైన నిర్ణయాన్ని ప్రకటించడం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎల్బీడబ్ల్యు విషయంలో ఇక ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇక ఈ మధ్యకాలంలో క్యాచ్ ల విషయంలో కూడా ఇలాంటి రివ్యూలు తీసుకుంటూ ఉన్నారు ఫీల్డ్ అంపైర్లు. అయితే ఇదే విషయంపై అటు భారత మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్దు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తిగా టెక్నాలజీ మీదే ఆధారపడితే ఇంకా ఫీల్డ్ ఎంపైర్లు ఎందుకు అంటూ ఆయన చేసిన కామెంట్లు కాస్త వైరల్ గా మారిపోయాయి. సాంకేతికత సహాయంతో 90% నిర్ణయాలు థర్డ్ అంపైర్లు తీసుకుంటున్నారు. దీంతో ఇలా క్రికెట్లో టెక్నాలజీ హవా నడుస్తున్న నేపథ్యంలో ఫీల్డ్ ఎంపైర్లు నామమాత్రంగా మారిపోయారు అంటూ నవజ్యోత్ సింగ్ సిద్దూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రానున్న రోజుల్లో అయినా ఫీల్డ్ ఎంపైర్లు విచక్షణతో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే మేలు జరుగుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ప్రతి నిర్ణయం విషయంలో థర్డ్ అంపైర్ పైనే ఆధారపడితే ఇక ఫీల్డ్ ఎంపైర్లు ఉండాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నించాడు. అయితే ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే అంటూ నవజ్యోత్ సింగ్ సిద్దు చేసిన కామెంట్స్ పై నేటిజన్స్ కూడా స్పందిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: