
ముంబై ఓపెనర్ ర్యాన్ రికిల్టన్ అదిరిపోయే స్టార్ట్ ఇవ్వగా, ఆ తర్వాత విల్ జాక్స్ (Will Jacks) బ్యాట్ ఝుళిపించాడు. 26 బంతుల్లో 36 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) మెరుపులు మెరిపించడంతో ముంబై గెలుపు లాంఛనమైంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీ కొట్టి పాయింట్ల పట్టికలో దూసుకుపోయింది. ప్రస్తుతం ఏడో స్థానానికి చేరుకుంది.
అంతే కాదు, ముంబై ఇండియన్స్ ఓ రేర్ రికార్డు కొల్లగొట్టింది. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్క వేదికపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ముంబై రికార్డు సృష్టించింది. వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు 47 మ్యాచుల్లో ఛేజింగ్‌కు దిగిన ముంబై ఏకంగా 29 మ్యాచుల్లో గెలిచి రికార్డుల రారాజుగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పేరిట ఉండేది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో 40 మ్యాచుల్లో 28 సార్లు ఛేజింగ్‌లో గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డుని ముంబై బ్రేక్ చేసింది.
టాప్ టీమ్స్ లిస్ట్ ఇదిగో:
ముంబై ఇండియన్స్ (MI): వాంఖడే స్టేడియంలో 47 ఛేదనల్లో 29 విజయాలు
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): ఈడెన్ గార్డెన్స్‌లో 40 ఛేదనల్లో 28 విజయాలు
రాజస్థాన్ రాయల్స్ (RR): సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో 31 ఛేదనల్లో 24 విజయాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): చిన్నస్వామి స్టేడియంలో 41 ఛేదనల్లో 21 విజయాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 32 ఛేదనల్లో 21 విజయాలు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK): చెపాక్ స్టేడియంలో 31 ఛేదనల్లో 20 విజయాలు
ఇక ముందు ముందు మ్యాచుల్లో ముంబై ఈ రికార్డుని మరింత పెంచుకునే ఛాన్స్ ఉంది. తర్వాత మ్యాచ్‌లో ఏప్రిల్ 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో వాంఖడేలోనే ముంబై తలపడుతుంది. అటు కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా గుజరాత్ టైటాన్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 21న మ్యాచ్ ఆడనుంది. మరి కోల్‌కతా ఈ రికార్డుని మళ్లీ అందుకుంటుందో లేదో చూడాలి.