బాలీవుడ్ బుల్లితెర ఆడియన్స్ ని బాగా అలరించిన సీరియల్ నటి స్మృతి ఇరానీ గురించి చెప్పాల్సిన పనిలేదు.. క్వోంకి సాస్ భీ బహు థి సీరియల్ తో భారీ క్రేజ్ అందుకుంది. ఇప్పుడు తాజాగా ఈ సీరియల్ రెండవ సీజన్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ సీరియల్లో స్మృతి ఇరానీ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సీరియల్ ని ఏక్తా కపూర్ నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ సీరియల్ కోసం రీయంట్రీ ఇస్తున్న స్మృతి ఇరానీ ఎంతటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే విషయం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.


క్వోంకి సాస్ భీ బహు థి 2 సీరియల్ కోసం స్మృతి ఇరానీ భారీగానే తీసుకుంటున్నదట.. ఇందులో ఒక్కో ఎపిసోడ్ కి 14 లక్షల రూపాయల చొప్పున తీసుకుంటున్నదట. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ..Z+ కేటగిరి తో షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ. అంతేకాకుండా సెట్స్ లో కఠినమైన ప్రోటోకాల్ ని కూడా ఫాలో కాబోతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ని అనుమతించలేదని గుర్తు తెలియని జనాలను షూటింగ్ సెట్లో కి అనుమతించే అవకాశం ఉండదట.


ఇటీవలే ఈ సిరీస్ కి సంబంధించి పోస్టర్ కూడా పూర్తి అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శృతి ఇరానీ రీ ఎంట్రీ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. క్వోంకి సాస్ భీ బహు థి సీరియల్లో తులసి కథను చూపించారు. కోడలుగా ఉన్నప్పుడు తులసితో ఎలా వ్యవహరించారు ఆ తర్వాత ఆమె అత్తగా మారినప్పుడు ఎలా వ్యవహరించ బోతుందో ఈ సీరియల్ లో చూపించారట. మొదటి ఎపిసోడ్  2000 సంవత్సరంలో జూలై 3 న విడుదల అయ్యింది.. అందుకే ఇప్పుడు రెండవ సీజన్ ని ఎప్పుడు విడుదల చేస్తారో అంటూ బాలీవుడ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: