విక్రమ్ ల్యాండర్ గుర్తుంది కదా.. చంద్రయాన్ 2 పంపిన రాకెట్ చంద్రునిపై దింపిన ల్యాండర్ ఇది. కానీ ల్యాండింగ్ సమయంలో చివరి నిమిషంలో జరిగిన పొరపాటుతో ఈ ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ కాలేకపోయింది. చేసిన ప్రయోగం అంతా ఫెయిలైంది.


కానీ ఇంకా ఈ ల్యాండర్ ఆచూకీ కోసం ఇంకా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మన ఇస్రో కంటే టెక్నాలజీలో ముందున్న నాసా తన వంతు ప్రయత్నాలు సాగిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్ -2లోని ల్యాండర్ విక్రమ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని నాసా తెలిపింది.


సాధారణ ఆపరేషన్ లో భాగంగా సోమవారం విక్రమ్ కోసం వెతికినట్లు నాసా శాస్త్రవేత్త నోవాహ్ పెట్రో తెలిపారు. ప్రస్తుతం వెలుతురు తక్కువగా ఉన్నపటికీ వాతావరణం అనుకూలించిందన్నారు. విక్రమ్ ల్యాండర్ కోసం జాగ్రత్తగా వెతుకున్నామని తెలిపారు.


అయితే విక్రమ్ జాడ తెలిసేందుకు కొంత సమయం పడుతుందని పెట్రో తెలిపారు. అయితే ఈ విక్రమ్ జాడ దొరికినా ఇక ఇప్పుడు చేసేదేమీ ఉండదు. దాని సెన్సార్లు పనిచేయకపోవడం.. ఆర్బిటార్ తో అనుసంధానం కోల్పోవడం వల్ల అది నిరుపయోగంగా మారిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: