వాట్సాప్ ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్ల కోసం యాప్ లో కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. యూజర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి తనవంతు కృషి చేస్తోంది. తాజాగా వాట్సప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. దీని సహాయంతో వినియోగదారులు అప్పటికే కొనసాగుతున్న గ్రూప్ కాల్స్‌లో సులభంగా చేరవచ్చు. ఇది ఉపయోగకరమైన ఫీచర్. అలాగే చాలా కాలంగా యూజర్ల నుంచి వస్తున్న డిమాండ్ ఇది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను విడుదల చేయడం ద్వారా కంపెనీ చాలా మందికి ఆ సౌకర్యాన్ని కల్పించింది. వాస్తవానికి ఇంతకు ముందు వినియోగదారులు గ్రూప్ వీడియో లేదా ఆడియో కాల్‌ని మిస్ అయినప్పుడు వారు మళ్లీ ఆ గ్రూప్ కాల్‌లో చేరలేరు. అలా మిస్ అయిన వారు కాల్‌లో ఉన్న మరొక వ్యక్తి సహాయం తీసుకోవాల్సి వచ్చేది.

ఇప్పుడు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఈ కొత్త ఫీచర్ సహాయంతో వినియోగదారులు గ్రూప్‌లో కొనసాగుతున్న కాల్స్‌లో చేరవచ్చు. కొత్త అప్‌డేట్ కింద యూజర్లు గ్రూప్ ఐకాన్ దగ్గర డెడికేటెడ్ బటన్‌ని చూడొచ్చు. వాట్సాప్ గ్రూప్‌లో కొనసాగుతున్న కాల్స్ లో వినియోగదారులు నేరుగా చేరగలరని వాట్సాప్ తెలిపింది.

చాలా మంది వ్యక్తులకు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి ఇంటి నుండి పని చేసే సమయంలో చాలా కార్యాలయాలు whatsapp లో గ్రూప్ లను సృష్టించాయి. అనేక సార్లు కమ్యూనికేషన్ కోసం గ్రూప్ కాల్స్ చేయాల్సిన అవసరం వచ్చింది. అటువంటి పరిస్థితిలో కొంత మంది వినియోగదారులు కాల్‌లను తీసుకోకపోతే లేదా ఏ కారణం చేతనైనా వారు కాల్ మిస్ అయితే ఆ తర్వాత వారు కొనసాగుతున్న కాల్‌లో మళ్లీ చేరవచ్చు.

వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది?
వినియోగదారులకు గ్రూప్ కాల్ వచ్చినప్పుడు బిజీగా ఉండటం వల్ల దానికి హాజరు కాలేకపోతే, జాయిన్ కాల్ ఫీచర్ సహాయంతో ఆ యూజర్లు మధ్యలో కాల్‌లో చేరవచ్చు. దీని కోసం కాల్ సమాచారం స్క్రీన్ పైనే కనిపిస్తుంది. దీనిలో ప్రస్తుతం ఎంత మంది వ్యక్తులు కాల్‌లో ఉన్నారో తెలుసుకోవచ్చు. కాల్ మిస్ అయితే మీరు ఇగ్నోర్ క్లిక్ చేసి, కాల్ ట్యాబ్ ద్వారా కాల్‌లో చేరవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: