ఆధార్‌ కార్డు, పాన్ కార్డు.. ఇవి లేకుండా ఇప్పుడు మనకు ఏ ప్రభుత్వ సేవలూ అందని పరిస్థితి ఉంది. ఇప్పుడు పుట్టగానే ప్రతి వ్యక్తికీ ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నారు. ఇక ఆ వ్యక్తికి ఏ ప్రభుత్వ పథకం కావాలనా.. అధికారికంగా గుర్తింపు కావాలన్నా ఈ ఆధార్ కార్డు తప్పనిసరి. అలాగే ఇప్పుడు దాదాపు ఆదాయం ఉన్న ప్రతి వ్యక్తికీ పాన్ కార్డు కూడా తప్పనిసరి అయ్యింది. అయితే మనం అనేక అవసరాల కోసం మన ఆధార్, పాన్ కార్డులు వినియోగిస్తుంటాం.


చాలాసార్లు వీటి జీరాక్సులు అవసరం అవుతుంటాయి. ప్రతి పథకం కోసం వీటి జీరాక్సు కాపీలు అందిస్తుంటాం. అయితే.. ఇప్పుడు సైబర్ నేరాలు బాగా పెరిగాయి. మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉపయోగించి ఆర్థిక నేరాలు చేసే ముఠాలు పుట్టుకొచ్చాయి. వారికి జస్ట్ మన ఆధార్ కార్డు, పాన్ కార్డు దొరికితే చాలు.. మన పేరు మీద వాళ్లు లోన్‌ తీసుకుంటారు.వివిధ పథకాల కింద మనకు తెలియకుండానే దరఖాస్తు చేస్తారు.


ఆ తర్వాత ఆ లోన్లు మన మీద ప్రభావం చూపుతాయి. మన సిబిల్ స్కోరు పడిపోతుంది. ఇటీవల ఇలాంటి మోసాలు చాలా వెలుగు చూస్తున్నాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆధార్, పాన్ కార్డులు వీలైనంత గోప్యంగా ఉంచండి. ఆన్‌ లైన్‌ మాధ్యమాల్లో ఈ ఆధార్, పాన్ కార్డులు ఉంచుకోకండి.. వాట్సప్‌ గ్రూపుల్లోనూ.. ఫేస్‌ బుక్ వంటి సోషల్ మీడియాలోనూ పొరపాటున కూడా ఈ కార్డులు ఉంచకండి. అతి అత్యంత ప్రమాదకరం.

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా చేసుకొని సైబర్‌ నేరస్థులు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త  పద్ధతుల్లో నేరాలు చేస్తున్నారు. అలాంటి వారికి ఈ ఆధార్ కార్డులు, ప్యాన్ కార్డులు దొరికితే చాలు.. అందుకే వీరు. జీరాక్స్ సెంటర్లను ఇలాంటి కార్డుల కోసం ఆశ్రయిస్తుంటారు. అలాగే.. వివిధ మార్గాల్లో వీరు ఈ ఆధార్, పాన్ కార్డులు సేకరిస్తుంటారు. ఆ కార్డులతో బ్యాంకులు, ప్రైవేటు సంస్థల్లో వ్యక్తి గత రుణాలు తీసుకుంటారు. అంతే కాదు.. మన పేరు మీద ఏకంగా నకిలీ కంపెనీలనే సృష్టిస్తారు. తప్పుడు లెక్కలు చూపించి అనేక రాయితీలు పొందుతుంటారు. ఆ తర్వాత వాటికి సంబంధించిన నోటీసులు మనకు వస్తుంటాయి. అందుకే తస్మాత్‌ జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి: