సాధారణంగా రాజకీయ నాయకులు అన్న తర్వాత ఇక వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ ఉండడం చేస్తూ ఉంటారు. ప్రజల మనిషి గా ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. అదే సమయంలో ఎన్నో రకాల కార్యాక్రమాలకు కూడా హాజరు అవుతూ ఉండటం గమనార్హం. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా వివిధ రకాల కార్యక్రమాలకు హాజరవుతున్న సమయంలో ప్రజా ప్రతినిధులు ఏకంగా అక్కడ ఉన్న ప్రజలతో కలిసి డాన్స్ చేయడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇక ఇలా కొన్ని కొన్ని సార్లు ఏకంగా రాజకీయ నాయకులు డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఇలా వివిధ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు లేదా ప్రచారంలో పాల్గొన్న సమయంలో డాన్సులు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ పార్టీలో అగ్రనాయకులు గా కొనసాగుతున్న వారు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఒకవేళ పొరపాటున అగ్రనాయకులు ఇలాంటి పని చేశారు అంటే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.  ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.


 ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకురాలిగా కొనసాగుతుంది ప్రియాంక గాంధీ. ఇక ఇటీవలే ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవాలో పర్యటిస్తున్నారు.. తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల గోవాలోని మోర్పిర్ల గ్రామానికి చెందిన గిరిజన మహిళలతో కలిసి మాట్లాడారు ప్రియాంక గాంధీ. అంతేకాదండోయ్ వారితో పాటు వారి సాంప్రదాయ నృత్యం కూడా చేసి అలరించారు. ఇక ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు  ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ మహిళలకు హామీ ఇచ్చారు. ఏదేమైనా ప్రియాంక గాంధీ డాన్స్ చేసిన వీడియో మొత్తం సోషల్ మీడియాను ఊపేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: