మన భారత దేశంలో కొత్త ట్రెండ్ ఉప్పందుకుంది .. అన్ని రంగాల్లో మగవారితో పోటీపడుతున్న ఆడవారు ఈ విషయంలో కూడా ఎక్కడా తగ్గేదేలే  అంటున్నారు .. మందుబాబులు కంటే మేమేం తక్కువ కాదంటూ మహిళలు కూడా  మద్యం బాటిల్లు తెగ గుటగుట లేపేస్తున్నారు .. అలా అని పెద్దపెద్ద మెట్రోపాలిటన్ సిటీలో వినిపించే వాళ్లు అనుకుంటే మాత్రం ఇక్కడ పప్పులో కాలేసినట్టే .. భారతీయ ఆల్కహాల్ సర్వే 2025 ప్రకారం మన భారతదేశంలో మగవారి కంటే ఎక్కువ మద్యం సేవిస్తున్న మహిళ రాష్ట్రాలు ఏవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..


మగవారు అత్యధికంగా మద్యం సేవిస్తారనే బావని ఇకపై మార్చి చెప్పేలా తప్పడం లేదు .. ఇప్పటికే జెన్ X, జెన్ Z,   మిలియన్స్ లో ఈ మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది .. హైదరాబాద్ ,ముంబాయి ,చెన్నై ,బెంగళూరు ,ఢిల్లీ వంటి మెట్రోపాలిటన్ సిటీస్లో నివసించే యువతలో ఈ కల్చర్ భారీగా పెరిగిపోయింది .. అయితే మన భారతీయ ఆల్కహాల్ సర్వే 2025 ప్రకారం మన భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే మహిళలే  పురుషుల కంటే అత్యధికంగా మద్యం తీసుకుంటున్నారు .. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ , సిక్కిం , అస్సాం టాప్ 3 లో చోటు దక్కించుకున్నాయి .. అలాగే తెలంగాణ నాలుగో ప్లేస్ లో ఉంది .. ఆ తర్వాత ప్లేస్ లో జార్ఖండ్, అండమాన్ & నికోబార్ దీవులు ,  ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి .


ఇలా బీర్, విస్కీ, వైన్, వోడ్కా ఇలా మొదలైన ఆల్కహాల్ ఆధారిత పానీయాలను సేవించే వారి సంఖ్య ప్రపంచవ్యాతంగా రోజురోజుకి పెరిగిపోతుంది .. వీకెండ్స్ లో పార్టీలు , పబ్బులు , వ్యక్తిగత వేడుకల్లో  ఈ ఆల్కహాల్  ఎంతో కామన్ గా మారిపోయింది .. ఇక మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో వయసు జెండర్ తో సంబంధం లేకుండా మద్యం తాగే సంస్కృతి రోజురోజుకీ పెరిగిపోతుంది .. ఇక మన భారతదేశంలో కేవలం మగవాళ్లే మద్యానికి బానిసలు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది .. కానీ అనేక రాష్ట్రాల్లో ఆడవారు ఈ విషయంలో వారికి పోటీ ఇస్తున్నారు .. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పాతకాలం నుంచి సాంప్రదాయ మద్యం సేవించే అలవాటు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం ..

మహిళలు అధికంగా మద్యం సేవించే రాష్ట్రాలు ఇవే :

• జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019 - 21 ప్రకారం .. ఆడవారిలో ఆల్కహాల్ పెరుగుదలకు ఎన్నో కారణాలు ఉన్నాయి .. ప్రధానంగా స్థానిక సంప్రదాయాలు మారుతున్న జీవనశైలి సామాజిక సంస్కృతిలు మారటం ,  అలాగే వారి జీవన విధానంలో వస్తున్న ఒత్తిడి వల్ల కూడా ఆడవాళ్లు ఇలా మద్యానికి బానిసలుగా మారుతున్నారని తెలుస్తుంది ..

• అయితే ఇప్పుడు ఈ లిస్టులో మొదటి స్థానంలో మన భారతదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ చోటు దక్కించుకుంది .. ఇక్కడి మహిళలు మద్యం సేవించే రేటు 24.2% గా ఉంది ..

• సిక్కిం లో ఏకంగా 16.2 శాతం మంది ఆడవారు ఇలా మద్యం స్వీకరిస్తున్నారు .. ఇక్కడి వారు చాంగ్ అనే ప్రసిద్ధ స్థానిక బీరును అధికంగా తాగడానికి ఇష్టపడతారు ..

• అలాగే ఈ జాబితాలో  అస్సాం మూడో ప్లేస్ లో ఉంది .. ఇక్కడివారు 7.3% మంది మహిళలు మద్యం సేకరిస్తున్నారు .  ఇక్కడ వారు విసికి ఎక్కువగా తాగుతారు ..

• అలాగే మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా 6.7% మంది ఆడవారు మద్యం స్వీకరిస్తున్నారు .. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ మహిళలే ఇందులో ఎక్కువగా ఉన్నారు .. వేడుకలు , ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మద్యం వినియోగం భారీగా పెరుగుతుందని అంటున్నారు ..

• అలాగే జార్ఖండ్‌లో జరిగిన ఓ అధ్యయన ప్రకారం  6.1% మంది ఆడవారు మద్యం తీసుకుంటున్నారు .. అలాగే ఎన్నో గిరిజన వర్గాల్లోని సంస్కృతిక ఆచారాలే ఇందుకు ప్రధాన కారణం ..

• అయితే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు మాత్రం మద్యం జోలికి అసలు వెళ్ళరని ఈ నివేదికలు చెబుతున్నాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి: