ఎవరైనా స్కూల్ పిల్లలు కనిపిస్తే చాలు ఏం చదువుతున్నారు ఎక్కడ ఉన్నారు అనే విషయాలను అడుగుతూ ఉంటారు చాలామంది. మరి కొంతమంది బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని సూచిస్తూ ఉంటారు. అయితే కొంతమంది స్కూల్ విద్యార్థులు చేస్తున్న పనుల వల్ల చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి మాత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక స్కూల్ విద్యార్థితో చాలా అసభ్యకరంగా తాకుతూ కనిపించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


అయితే ఈ వీడియోలో కనిపించిన వివరాల మేరకు.. బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి ఎదురుగా స్కూల్ కి వేగంగా వెళుతున్న అమ్మాయిని సడన్గా టచ్ చేసారు. అది కూడా ఆ అమ్మాయి ప్రైవేట్ భాగాలను  తాకినట్టుగా కనిపిస్తోంది. దీంతో ఆ అమ్మాయిలో ఒక్క క్షణం అయోమయంలో పడినట్టుగా అక్కడే నిలిచిపోయింది. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక చివరికి స్కూలు బాటే పయనం కట్టింది. కానీ ఈ ఇన్సిడెంట్ సీసీటీవీ కెమెరాలో రికార్డు అవ్వడంతో ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ కావడంతో అలా తాకిన వ్యక్తికి పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


అయితే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ వీడియో వైరల్ అయిన 24 గంటలలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం ఆ వ్యక్తిని పట్టుకొనే సమయంలో పరిగెత్తుతూ ఉండగా ఆ వ్యక్తి కాళ్ల పైన కూడా షూట్ చేసినట్లు సమాచారం.అందుకు  సంబంధించి కొన్ని ఫోటోలు కూడా మాధ్యమికాలలో వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి పాడు పని చేసే  వెధవలకు తగిన శాస్తి జరిగింది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీదట ఎవరైనా ఇలాంటివి చేయాలి అంటే భయపడేలా చేశారంటూ యూపీ పోలీసులను ప్రశంసిస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: