
చంద్రగ్రహణం అంటే ఏమిటి?
చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. చంద్రగ్రహణం సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సూటి రేఖలోకి వస్తాయి. భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడు చీకటిగా, ఎర్రటి రంగులో కనబడతాడు. ఇది కేవలం ఒక ఖగోళ శాస్త్రీయ పరిణామం. కానీ పురాతన కాలంలో దీన్ని చాలా భయంకరంగా భావించారు. ఎందుకంటే, అప్పట్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. ఆకాశంలో ఈ మార్పు కనిపించగానే, ప్రకృతిలో కూడా ఏదో మార్పులు వస్తున్నాయనేది అందరికీ అనిపించేది.
గ్రహణ సమయంలో వాతావరణ మార్పులు:సూర్య కిరణాల తక్కువతనం: చంద్రగ్రహణం సమయంలో సూర్య కాంతి నేరుగా భూమిపై పడదు. సూర్యుని నుంచి వచ్చే UV కిరణాలు తగ్గిపోతాయి. దీని వల్ల సూక్ష్మజీవులు చురుకుగా పెరిగే అవకాశాలు ఉంటాయి.
ఉష్ణోగ్రతల మార్పు: గ్రహణ సమయాల్లో వాతావరణంలో తక్షణ ఉష్ణోగ్రత మార్పులు జరుగుతాయి. దీని ప్రభావం ఆహార పదార్థాలపై పడుతుంది.
ఆహారం త్వరగా పాడవడం: ముఖ్యంగా మాంసం, గుడ్లు, పాలు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఈ సమయంలో త్వరగా పాడైపోవచ్చు.
చికెన్ ఎందుకు తినకూడదు..:
చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువ. మాంసంలో ఇప్పటికే సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. గ్రహణ సమయంలో సూర్య కాంతి తగ్గడం వల్ల ఈ సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. తిన్న వెంటనే ఆహారం కడుపులో ఫెర్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, ఫుడ్ పాయిజనింగ్ అవకాశాలు ఎక్కువ. పాతకాలంలో ఫ్రిజ్ లేదా కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ. అందుకే పెద్దలు మాంసాహారాన్ని పూర్తిగా మానేశారు. గ్రహణ సమయంలో కూరగాయలు, పండ్లు కూడా పాడవుతాయని నమ్మకం. అందుకే అవి వాడకూడదని చెప్పేవారు. అయితే కూరగాయలు, పండ్లు శాకాహార పదార్థాలు కాబట్టి వాటి పాడవడం మాంసం కంటే తక్కువ. కానీ అజాగ్రత్తగా నిల్వ చేస్తే అవి కూడా బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతాయి.
శాస్త్రీయ జాగ్రత్తలు:
ఇప్పట్లో సైన్స్ అభివృద్ధి చెందింది. ఫ్రిజ్, డీప్ ఫ్రీజింగ్ వంటివి వాడుతున్నాం. కానీ ఇప్పటికీ కొన్ని సేఫ్టీ సూచనలు పాటించడం మంచిది. ఆహారంపై తులసి ఆకులు లేదా పసుపు వేస్తే బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుందని ఆయుర్వేదంలో చెబుతారు. ఈ సమయంలో లైట్ ఫుడ్, లిక్విడ్స్ ఎక్కువగా తినడం జీర్ణక్రియకు మంచిది. భారతీయ సంప్రదాయంలో చంద్రగ్రహణం పవిత్రమైన యోగ సమయంగా భావిస్తారు. ఈ సమయంలో ధ్యానం, జపం, పూజలు చేస్తారు. చంద్రగ్రహణం రోజున చికెన్ తినకూడదని చెప్పడం కేవలం ఆచారం కాదు, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి . పూర్వీకులు ఆ సమయంలో శరీరానికి హానికరం కాకుండా ఉండే ఆహారపు అలవాట్లను పాటించారు. ఇప్పటికీ ఈ సలహాలు పాటిస్తే ఆరోగ్యానికి మంచిదే.