తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పబ్లిక్‌తో ఎలా ఉండాలో బాగా తెలిసిన నాయకుడిగా ఆయ‌న‌కు మంచి మార్కులు ప‌డ‌తాయి. ప్రజల మధ్య కలిసిపోయే రేవంత్ త‌త్వం ఇప్ప‌టికే ప‌లుమార్లు హైలెట్ అయ్యింది. ఇటీవల హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు అనూహ్యంగా పలు కాలనీల్లోకి వెళ్లిపోవడం అందరికీ గుర్తుండే సంఘటన. ఆ సమయంలో ఆయన వెళ్లడం పబ్లిసిటీ స్టంట్ అనుకున్నా, నిజానికి ఆయన రాక గురించి అక్కడి ఉన్నతాధికారులు తప్ప మరెవరికీ తెలియదు. ఈ విధంగా రేవంత్ ముందస్తు ఆర్భాటాలు లేకుండా, ప్రజల మధ్యకు వెళ్లే తీరే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.


ఇప్పుడు గణేష్ నిమజ్జనాల సమయంలోనూ ఆయన అదే తరహా సింప్లిసిటీని ప్రదర్శించారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా, అధికారిక వాహనాలు లేకుండా నేరుగా ట్యాంక్ బండ్ మీదకు వచ్చారు. సాధారణంగా సీఎం నిమజ్జనాల సమయంలో వస్తే ఏర్పడే గందరగోళం వేరే చెప్పనవసరం లేదు. భక్తులకు, పోలీసులకు, నిర్వాహకులకు అనవసరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ రేవంత్ రెడ్డి అలా చేయకుండా, ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం పూర్తి అయిన తర్వాతే అక్కడకు రావడం ఆయ‌న సింపుల్ సిటీ వైఖరిని సూచిస్తోంది. సీఎం ట్యాంక్ బండ్ వద్దకు వచ్చిన తర్వాత భక్తుల వెంట కలిసి “గణపతి బప్ప మోరియా” నినాదాలు చేశారు. భక్తులను ఉత్సాహపరిచారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని, మున్సిపల్ కార్మికులను అభినందించారు.


అలసట లేకుండా సేవలు అందిస్తున్న వారిని ప్రోత్సహించడం ద్వారా ఆయన మానవీయ వైఖరి మరోసారి బయటపడింది. రేవంత్ రెడ్డి ఇలా రావడం వల్ల భాగ్యనగర్ ఉత్సవ సమితి కూడా ఆనందం వ్యక్తం చేసింది. సీఎం వ్యక్తిగతంగా ఆసక్తి చూపడం, ఏర్పాట్లను పరిశీలించడం వారికీ పెద్ద మద్దతుగా నిలిచింది. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో అధికార యంత్రాంగం మాత్రమే ముందుండగా, సీఎం స్వయంగా హాజరై శ్రద్ధ చూపించడం స్పెషాలిటీ అని చెప్పుకోవాలి. ఈ సింపుల్ సిటీతో పాటు ప‌బ్లిక్ ప‌ల్స్ ప‌ట్టుకునే విష‌యంలో రేవంత్ ముందు తెలంగాణ‌లో మ‌రే నాయ‌కుడు సాటి రార‌నే చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: