బోనీ కపూర్ తాజాగా శ్రీదేవి పై నిర్మాతలు, డైరెక్టర్ చేసిన ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నా భార్య అలాంటిది కాదని,అలా చేసి ఉంటే ఇన్ని సినిమాల్లో నటించేది కూడా కాదని,ఆమె ఇంత పెద్ద ఫేమస్ అయ్యేది కూడా కాదు అంటూ చాలా ఎమోషనల్ కామెంట్లు చేశారు.మరి ఇంతకీ బోనీకపూర్ అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి.. శ్రీదేవి పై వచ్చిన ఆరోపణలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రకి రమ్యకృష్ణ కంటే ముందు శ్రీదేవిని అనుకున్నానని రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే. అయితే శ్రీదేవిని మొదట అనుకున్నప్పటికీ ఆమె రెమ్యూనరేషన్ తో పాటు లగ్జరీ ఏర్పాట్లు చేయమంది అని చెప్పడంతో నిర్మాతలు పక్కన పెట్టారంటూ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఒకవేళ శ్రీదేవిని ఇందులో తీసుకుంటే అస్సలు సెట్ అయ్యేది కాదని రమ్యకృష్ణ మాత్రమే ఇందులో సెట్ అయింది అని చెప్పుకొచ్చారు. 

శ్రీదేవి పై వచ్చిన ఆరోపణల పై ఆమె బతుకున్న సమయంలో క్లారిటీ ఇచ్చింది.నేను అన్ని లగ్జరీ ఏర్పాట్లు చేయమని చెప్పి అలాగే ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగి ఉంటే 300 సినిమాల్లో చేసి ఉండేదాన్నే కాదు.. ఒక డైరెక్టర్ అయి ఉండి మరొకరిపై ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు అంటూ రాజమౌళికి కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలపై తాజాగా బోనీకపూర్ కూడా స్పందించారు. రాజమౌళికి శ్రీదేవి రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు తప్పుగా సమాచారం ఇచ్చారు. ఎందుకంటే మొదట శ్రీదేవికి సినిమా స్టోరీ చెబుతానని రాజమౌళి చాలా సార్లు మా ఇంటికి వచ్చారు. అలాగే నేను మీకు పెద్ద అభిమానిని అంటూ శ్రీదేవికి రాజమౌళి పెట్టిన మెసేజ్ ఇప్పటికీ అలాగే ఉంది.ఇక శ్రీదేవి 10 కోట్ల రెమ్యూనరేషన్,లగ్జరీ ఏర్పాట్లు చేయమని,ఫ్లైట్ టికెట్లు అరేంజ్ చేయమని చెప్పింది పూర్తిగా అవాస్తవం. రాజమౌళి వచ్చి ఆమెకి కథ చెప్పాక నిర్మాతలు ఇందులోకి ఎంటర్ అయ్యారు.

 ఆమె బాహుబలి సినిమాకి తాను నటించిన ఇంగ్లీష్ వింగ్లిష్ మూవీ కంటే తక్కువ రెమ్యూనరేషన్ ని అడిగింది. ఇక శ్రీదేవి చనిపోయే వరకు కూడా తన స్టార్డం మెయింటైన్ చేసింది. ఆమె చాలా పెద్ద హీరోయిన్. తెలుగు హిందీ సినిమాల్లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ బాహుబలి సినిమాలో ఆమె క్యారెక్టర్ కి మంచి ఇమేజ్ వస్తుందని ఒక మెట్టు దిగి నేనే సినిమా చేయమని చెప్పేవాడిని. కానీ నిర్మాతలు మాత్రం శ్రీదేవి పై తప్పుడు ప్రచారం చేశారు. రాజమౌళికి తప్పుగా సందేశం పంపించారు. మేం అడిగిన రెమ్యూనరేషన్ కి పూర్తిగా రివర్స్లో చెప్పారు.మేము మా పిల్లలకి హాలిడేస్ ఉన్న సమయంలో పెద్ద షెడ్యూల్  పెట్టుకోమని చెప్పాము. కానీ దీనికి రివర్స్లో నిర్మాతలు డైరెక్టర్ తప్పుడు సమాచారం అందించారు. అలాగే నిర్మాత శోభు యార్లగడ్డకి డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేకే ఈ ఆరోపణలు చేశారు.ఒకవేళ శ్రీదేవి నిజంగానే అలా డిమాండ్ చేస్తే అంత పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసేది కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత బోనీ కపూర్

మరింత సమాచారం తెలుసుకోండి: