పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. 2014 సంవత్సరంలో ఈ పార్టీని స్థాపించిన 2019 వ సంవత్సరం ఈ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. కానీ ఆ దఫా జనసేన పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2024 వ సంవత్సరం ఈ పార్టీ తెలుగుదేశం , బిజెపి లతో పొత్తులో భాగంగా పోటీ చేసింది. ఈ పోటీలో జనసేన అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నాడు. ఇకపోతే 2024 ఎలక్షన్ల కంటే ముందు పవన్ కళ్యాణ్ , వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఏ సభ జరిగిన ఎక్కడ సమయం , సందర్భం వచ్చిన కూడా జగన్ మోహన్ రెడ్డి ని వైసీపీ పార్టీని ఎండ గట్టే పనిలో పవన్ సక్సెస్ అయ్యాడు.

ఇక తెలుగుదేశం , జనసేన కలిసి ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం కంటే కూడా పవన్ కళ్యాణ్ , వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని తనదైన రీతిలో మాటలతో ఎదుర్కొన్నాడు. ఆ స్థాయిలో ఫైట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఆ రేంజ్ దూకుడును చూపించడం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్నాడు. ఇక ఈ పర్యటనలలో అక్కడక్కడ చెదురు మొదలు సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. దీనితో జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో రియాక్ట్ అవుతాడు అని చాలా మంది అనుకున్నారు.

కానీ పవన్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నాడు. తెలుగు దేశం పార్టీ సభ్యులు కాస్త రియాక్ట్ అవుతున్న పవన్ మాత్రం అస్సలు రియాక్ట్ కావడం లేదు. దానితో అనేక మంది పవన్ సైలెన్స్ వెనుక పెద్ద వ్యూహం ఉంది. ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గా ఉన్నాడు. ఆయన ఇప్పుడు వైసిపి పై రియాక్ట్ అవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని , వచ్చే కంపెనీలు , రాష్ట్ర అభివృద్ధిపై అది ఎఫెక్ట్ చూపుతుంది అనే ఉద్దేశంతో ఆయన సైలెంట్ ఉంటున్నారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: