ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నాయకులలో గంటా శ్రీనివాసరావు ఒకరు. ఈయన ఇప్పటివరకు అనేక ఎన్నికలలో పోటీ చేసి అందులో చాలా విజయాలను అందుకున్నాడు. గంటా శ్రీనివాసరావు రెండు సార్లు మంత్రి గా కూడా పని చేశాడు. ఇంత గొప్ప విజయాలను అందుకొని ఎంతో గొప్ప నాయకుడిగా పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం మాత్రం చాలా గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ లో ఈయనకు మొదట అద్భుతమైన గుర్తింపు ఉండేది. కానీ ప్రస్తుతం ఆ స్థాయి గుర్తింపు ఈయన కు ఆ పార్టీలో లేదు అనే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు.

2024 వ సంవత్సరం టికెట్ కోసం అత్యంత కష్ట పడిన వ్యక్తులలో ఈయన కూడా ఒకరు. కానీ చివరగా ఈయనకు టికెట్ వచ్చింది. భీమిలి నుండి పోటీ చేసిన ఈయనకు విజయం కూడా దక్కింది. ఇకపోతే ఒకానొక సమయంలో గంటా శ్రీనివాసరావు అనుకుంటే పని అయిపోతుంది అనుకున్న వ్యక్తులు కూడా ఆయనకు దూరం అయినట్లు తెలుస్తోంది. ఇక ఆయన గెలుపు కోసం పోరాడిన వ్యక్తులు కూడా ఆయన పక్కన ప్రస్తుతం లేరు అనేది కొంత మంది వాదన. ఇక ఈయన మీటింగ్ పెడదాము అనుకున్న కూడా సహచర ఎమ్మెల్యే లు కూడా ఈయనకు సపోర్ట్ చేయని పరిస్థితుల్లో ప్రస్తుతం ఈయన ఉన్నట్లు తెలుస్తోంది.

ఎంతో గొప్ప స్థాయి ఈమేజ్ కలిగిన రాజకీయ నాయకులలో ఒకరు అయినటువంటి ఈయన స్థాయి ప్రస్తుతం హైకమాండ్ వద్ద తగ్గింది అని కొంత మంది ఒక వాదనను వినిపిస్తున్నారు. ఏదేమైనా కూడా ఒకానొక సమయంలో అద్భుతమైన ఈమేజ్ కలిగిన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగిన గంట శ్రీనివాసరావు ప్రస్తుతం మాత్రం తన సొంత నియోజకవర్గం లోనే ఒంటరి పోరాటం చేస్తున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gsr