రామ్ పోతినేని..ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ఈ మధ్యకాలంలో చేసే సినిమాలు కాస్త ఆయన మార్కెట్ ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత చేసిన డబుల్ ఇస్మార్ట్,ది వారియర్ వంటి రెండు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం రామ్ పోతినేని ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా పైనే పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్లు ఎన్నో ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఇప్పటికే ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ కోసం ఇన్నేళ్లుగా ఎన్నడు చేయని పని చేశారు రామ్ పోతినేని.

 అదేంటంటే సినిమా కోసం స్పెషల్గా పాట రాశారు.. ఇక రామ్ పోతినేని రాసిన పాట ఎలా ఉంది అంటే ఏదో అనుభవం ఉన్న పాటల రచయితలు రాసిన లిరిక్స్ లానే అద్భుతంగా ఉన్నాయి.అయితే ఎన్నడూ లేనిది తన సినిమా కోసం స్పెషల్ గా రామ్ పోతినేని పాట రాసారంటూ అది కేవలం భాగ్యశ్రీ బోర్సేని ప్రేమలో పడేయడం కోసమే అంటూ ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించాయి.ఎందుకంటే ఈ సినిమా మొదలైనప్పటినుండి రామ్ పోతినేని భాగ్యశ్రీల ప్రేమ వార్తలు హార్ట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.ముఖ్యంగా వీళ్లిద్దరు పెట్టే సోషల్ మీడియా పోస్టులు ఒకే రకంగా ఉండడంతో వీరి మధ్య ఏదో నడుస్తుంది అనే అనుమానం అందరిలో నెలకొంది.ఈ నేపథ్యంలోనే సినిమా కోసం స్పెషల్ గా పాట రాయడంతో చాలామంది భాగ్యశ్రీ కోసమే ఈ పాటని రాసారని ప్రేమలో ఉంటే తప్ప ఇంత మంచి లిరిక్స్ రావని మాట్లాడుకున్నారు.

అయితే తాజాగా మరో రూమర్ కూడా వినిపిస్తోంది.అదేంటంటే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా కోసం పాట రాయడమే కాదు స్వయంగా ఓ పాట కూడా పాడబోతున్నారట హీరో రామ్ పోతినేని.. అయితే ఇప్పటివరకు రామ్ పోతినేని తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఒక్క సినిమాలో కూడా పాట పాడలేదు.అలాంటిది ఫస్ట్ టైం ఓ పాట పాడబోతుండడంతో చాలామంది నెటిజన్స్ మళ్లీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు కొంతమంది నెటిజన్స్ అయితే భాగ్యశ్రీ బోర్సేని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవడం కోసమే రామ్ పోతినేని ఇలా తిప్పలు పడుతున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి రామ్ పోతినేని నిజంగానే భాగ్యశ్రీని ప్రేమిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: