టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ SSMB 29 . ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా  మహేష్ బాబు కెరియర్ లోనే చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెన్యాలో జరగగా ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. లీకైన ఫోటోలతోనే సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టిస్తోంది SSMB 29. మహేష్ బాబు లుక్ అభిమానులను చాలా ఆకట్టుకుంది.



కెన్యా షూటింగ్ ను  పూర్తిచేసుకున్న మహేష్ బాబు ఇటీవలే హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. మహేష్ బాబు బర్తడే సందర్భంగా రాజమౌళి SSMB 29 ఫోటోని మహేష్ బాబు లుక్ కనిపించకుండా రిలీజ్ చేశారు. అదే రోజు ఫస్ట్ గ్లింప్స్ ను నవంబర్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రకారం.. గ్లింప్స్ తో పాటు అధికారికంగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్టును 2027 సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేలా బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయం తెలిసి అభిమానులు  రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసి సినిమా బజ్ పెంచేలా రాజమౌళి ప్లాన్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.


ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. మహేష్ బాబు క్రేజ్ కి  SSMB 29 కోసం రాజమౌళి చాలామంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకువచ్చారు. మరి గ్లింప్స్ తో ఎలాంటి హైప్ పెంచేచేస్తారో చూడాలి మరి. మొత్తానికి ఈ విషయం టాలీవుడ్ లోనే వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: