సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నా, సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దగల డైరెక్టర్లు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ జాబితాలో అనిల్ రావిపూడి కచ్చితంగా టాప్ 5 స్థానంలో ఉంటారు. పాన్-ఇండియా స్థాయిలో సినిమాను తారస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే, సాధారణ స్థాయిలో, సాధారణ కథతో కూడా మంచి హిట్ ఇవ్వవచ్చని, రికార్డులు క్రియేట్ చేయవచ్చని, అంతకంటే ప్రతిష్ఠాత్మకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించవచ్చని అనిల్ రావిపూడి నిరూపించాడు. ‘పటాస్’ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి, ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడం చిన్న విషయం కాదు.


ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తుంది.  రెండో హీరోయిన్‌గా క్యాధరిన్ ధెరిసా  దాదాపు ఖరారయింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ పై ప్ఫస్ట్ నుంచి అందరికి ఓ స్పెషల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ పాటలో నటించబోయే హీరోయిన్ వివరాలు కూడా బయటకొచ్చాయి. సినిమా వర్గాల సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ సాంగ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించబోతుంది. అంతేకాకుండా, మెగాస్టార్-తమన్నా మధ్య ఉండే డాన్స్ స్టెప్స్ మరింత హైలైట్ కానున్నాయని టాక్ వినిపిస్తోంది.



దీంతో అభిమానుల్లో ఈ కాంబినేషన్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిరంజీవి-తమన్నా కాంబినేషన్‌లో వచ్చిన ‘భోళాశంకర్’ సినిమా హిట్ కాకపోయినా, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్‌తో స్టెప్పుల విందు ఇవ్వబోతున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. తమన్నా మంచి డాన్సర్‌గా పేరుపొందింది. చిరంజీవితో మళ్లీ స్టెప్పులు వేసే ఈ అవకాశాన్ని ఆమె ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ “ఈ జంట డాన్స్ చేస్తే మంచంలో ఉన్నవాళ్లకూ ఊపు వస్తుంది” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: