ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. అయితే తెలంగాణతో ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన  తర్వాత మొదటిసారి చంద్రబాబే సీఎం అయ్యారు. ఆ తర్వాత రెండోసారి జరిగిన ఎలక్షన్స్ లో జగన్ సీఎం అయ్యారు. మూడోసారి జరిగిన ఎలక్షన్స్ లో  చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇదే తరుణంలో చంద్రన్న కేవలం ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు వ్యవహరించడమే కాకుండా కేంద్రంలో కూడా కీలకమైనటువంటి ప్లేస్ లో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ సర్కార్ కేంద్రంలో కొలువుదిరింది అంటే దానికి చాలా వరకు చంద్రబాబే కారకుడు.ఈయనే ప్రధాన పిల్లర్ అని చెప్పవచ్చు. అలాంటి చంద్రబాబు ఏది అడిగినా కేంద్రం ఇట్టే ఇచ్చేస్తుంది. దీంతో ఆయన కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

అంతేకాదు ఏపీలో అమరావతి రాజధానిని అద్భుతంగా తీర్చిదిద్దాలని వడివడిగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఐటీ కారిడార్స్, రోడ్లు, రవాణా ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి పనులను కేంద్రం నుంచి తీసుకువచ్చి నిధులు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మోదీ ఆంధ్రాకి సరికొత్తగా నిధులు కేటాయించారు. ముఖ్యంగా రాష్ట్రాలలో డెవలప్ అవుతుంది అంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులే ఉంటాయి. రాష్ట్రాలకు నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో ఎక్కువగా నిధులు వస్తూ ఉంటాయి. వీటి ద్వారా విలేజ్ క్లినిక్స్, వార్డు క్లినిక్స్ లాంటివి నిర్మాణాలు చేసుకుంటారు.. ఇప్పుడు కొత్తగా 217 కోట్లు కేంద్రం కేటాయించింది.

వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అని పిలుస్తారు. ఉపాధి హామీ నిధులతో 2,309 భవనాలను నిర్మించబోతున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ ఫాస్ట్ట్రక్చర్ నిధులతో 696 క్లినిక్ భవనాలు కట్టబోతున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి 42 లక్షల చొప్పున, విద్యుత్, త్రాగు నీరు సౌకర్యానికి 13 లక్షలు కేటాయిస్తున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ గా ఎన్నో నిధులు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ నిధులతో గిఫ్టులు ఇస్తున్నారని చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: