టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి సుమారుగా రెండేళ్ల గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ఘాటి. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూరి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. ఇందులో విక్రమ్ ప్రభువు కూడా నటించారు. జగపతిబాబు, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ తదితర నటీనటులు నటించారు. భారీ అంచనాలతో నిన్నటి రోజున విడుదలైన ఈ సినిమా బజ్ బాగా క్రియేట్ చేసుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా ఘాటు దెబ్బ పడ్డట్టుగా వినిపిస్తున్నాయి.



ట్రైలర్ తో, యాక్షన్స్ సన్నివేషాలతో అనుష్క కెరియర్ లో కచ్చితంగా ఘాటి  సినిమా భారీ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావించారు. కానీ మొదటి  షో నుంచే మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. దీనివల్ల  బుకింగ్స్ పైన కూడా చాలా గట్టిగానే ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ.5.33 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రెడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అనుష్క కెరియర్ లోనే ఇంత తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. దాదాపుగా రూ .10 కోట్ల రూపాయలకు పైగా మొదటి రోజు కలెక్షన్స్ సాధిస్తుందని అంచనా వేసినప్పటికీ..  అంచనాలను తారుమారు చేసింది.


ఘాటి సినిమా రూ .50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా 52 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.55 కోట్ల రూపాయల షేర్ రూ .100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ కి ఘాటి సినిమా అంచనాలను అందుకోలేకపోయింది . అనుష్క సినిమాలకు చాలా గ్యాప్ ఇవ్వడం వల్ల అనుష్క క్రేజ్ కూడా తగ్గిందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. అలాగే  వినాయకుడి నిమర్జనం ఉండడం వల్ల చాలామంది థియేటర్లకు వెళ్లలేదనే విధంగా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈరోజు, రేపు ఎలాంటి కలెక్షన్స్ రాబడతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: