ఒక పేపర్ తీసుకుని పంచదార పోసి, దానిపైన ఓవెన్లో ఉడికించిన పధార్ధాన్ని వేడి చల్లారకుండా వేయాలి. పధార్థం వేడిగా ఉన్నప్పడే స్పూన్ సాయంతో కేక్ మీద జామ్ రాయాలి. ఈ కేక్ పై ఐసింగ్ షుగర్, కోకో మొదలైన వాటితో అలంకరించి సర్వ్ చేస్తే సరి. కావాలసిన పధార్థాలు : బంగాళదుంపలు : అరకేజీ అల్లం : 1 అంగులం ముక్క ఉల్లిపాయలు : 3  పచ్చిమిర్చి : 5  ఉప్పు : తగినంత తురిమిన కొబ్బరి : 1 కప్పు కరివేపాకు : 4 నూనె : 2 టేబుల్ స్పూన్లు  కొత్తిమీర : తగనంత


తయారు చేయువిధానం : ఉల్లిపాయలు సన్నగా తరగాలి. అల్లం, పచ్చిమిర్చి, మిక్సీ చేసి ఉంచాలి. బంగాళదుంపలు ఉడికించి వాటిని ముక్కలుగా చేసి కొబ్బరి తురిమి మిక్సీకి వేసి కొబ్బరిపాలు మూడు సార్లుగా తీసివుంచాలి.


పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు వేయించి, అల్లం మిర్చి ముద్ద కూడా వేసి వేయించాలి. కొబ్బరిపాలు పాన్లో వేస్తూ బంగాళాదుంపలు ముక్కలు వేసుకుని ఉప్పు వేయాలి. అది ఉడికినప్పడు కరేవాకు, కొత్తిమీరతో గార్నింగ్  చేయాలి. ఈ కూరని పూరిలలోకి , రోటీలోకి బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: