ఆడవాళ్లు ప్రతి రోజు ఎన్నో రకాల సవాళ్ళను ఎదుర్కోవలిసి వస్తుంది. ఒకపక్క ఇంటి పని చేస్తూ మరో పక్క కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చుతూ తన గూర్చి తాను పట్టించుకునే తీరిక లేకుండా పోతుంది.అలాగే కొంతమంది మహిళలు ఇంట్లో బాధ్యతలతో పాటు బయట ఉద్యోగం కూడా చేస్తారు.ఇన్ని పనులు చేసే ఆడవాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ద అనేది చాలా అవసరం. ఆడవాళ్ళలో వ్యాధినిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. ఫలితంగా నీరసం రావటం, ఊరికే అలసట రావడం జరుగుతుంది. అందుకే సరైన విధంగా తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.ఇంట్లో ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందులోను ఇప్పుడు అసలే కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దానికి తోడు వర్షాకాలం.. ఎక్కువగా వ్యాధులు వస్తాయి.


అందుకనే  లోకల్ అలాగే సీజనల్ ఫుడ్స్‌ని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్‌ని పొందవచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మన శరీరం పర్యావరణం వల్ల ప్రభావితపడుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల ప్రభావం శరీరంపై కచ్చితంగా ఉంటుంది. అటువంటి మార్పులకు అనుగుణంగా శరీరం ఉండలేనప్పుడు కొన్ని విధాల రియాక్షన్స్ వస్తాయి. దీనివల్ల వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం తలెత్తుతుంది. మనం తినే ఆహారం ప్రకృతితో సింక్ కానప్పుడు,ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అనారోగ్యకరంగా బరువు పెరగడం జరుగుతుంది.లేదా అకారణంగా బరువు తగ్గడం జరుగుతుంది. స్కిన్ హెల్త్ దెబ్బతింటుంది. అదే సమయంలో జుట్టు సమస్యలు కూడా వస్తాయి.


అసలే ఇది వర్షాకాలం అందుకనే తినే ఆహారపదార్ధాలలో  పుల్లటివాటిని, ఉప్పగా ఉండేవాడిని అలాగే జిడ్డుగాలేని వాటిని ఈ కాలంలో తినవచ్చు. డైట్ లో సూప్ ను కూడా తీసుకోవచ్చు. అలాగే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం చాలా మంచిది. ఈ సమయంలో నదీజలాలను తాగడం, ఎక్కువగా నీళ్లను మరియు వైన్ ను తాగడం అలాగే సులభంగా డైజెస్ట్ అవని పదార్థాలను తినడం మంచిది కాదు.అందుకని  సీజన్ కు అనుగుణంగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి... !!

మరింత సమాచారం తెలుసుకోండి: