పెసలు పేరు వినగానే ముందు గుర్తుకువచ్చేది పెసరట్టు.. వేడి వేడిగా పెసరట్టు వేసుకుని అందులో కొంచెం అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఎర్రగా కాల్చుకుని తింటే భలే రుచిగా ఉంటుంది కదా.. అయితే పెసలు ఒక్క అట్టుకి మాత్రమే ఉపయోగపడతాయి అంటే అది పొరపాటే.. ఆడవాళ్ళ సౌందర్యానికి కూడా పెసలు ఉపయోగపడతాయి తెలుసా..  పెసలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పెసలతో ప‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పెస‌ల వ‌ల్ల ఆడవాళ్ళ ముఖానికి, జుట్టుకు  సంబంధించి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం..! రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో కొన్ని పెస‌ల‌ను వేసి నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే వాటిని మిక్సీ ప‌ట్టి పేస్ట్‌లా చేసుకుని అందులో 1/2 టీస్పూన్ నెయ్యి వేసి బాగా క‌లిపి దాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి.



ఇలా వారంలో 3 సార్లు చేస్తే మొటిమ‌ల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే పొడి చర్మం ఉన్న‌వారు  రాత్రిపూట కొన్ని ప‌చ్చిపాల‌ను తీసుకుని వాటిలో కొన్ని పెస‌ల‌ను వేసి నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ మిశ్ర‌మాన్ని గ్రైండ్ చేసి దాన్ని ఫేస్‌ప్యాక్‌గా ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలు తర్వాత నీటితో క‌డిగేయాలి. ఒక గ్లాసు నీటిలో గుప్పెడు పెస‌ల‌ను వేసి రాత్రంతా నాన‌బెట్టి ఉద‌యాన్నే వాటిని పేస్ట్‌లా చేసుకుని అందులో పెరుగు లేదా అలోవెరా జెల్ వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాలు ఆగాక చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. ఎలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.



అలాగే జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళు కొన్ని పెసల్ని ఉడకబెట్టి రుబ్బండి. ఇందులో గుడ్డు పచ్చసొన, కొంచెం నిమ్మరసం, పెరుగు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి పదిహేను నిమిషాలు ఉంచండి. షాంపూతో తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలని ఈ ప్యాక్‌ పోగొడుతుంది. అలాగే ముఖం మీద అవాంఛిత రోమాలతో బాధపడుతుంటే ఒక 100 గ్రాముల పెసలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం వీటిని పిండిగా చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల గంధపు పొడి మరియు 2 టేబుల్ స్పూన్ల ఆరంజ్ తొక్కల పొడిని కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త పాలు పోసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని మర్దనా చేసుకోవడం వలన ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: