ఇండియన్ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో సేల్ చేస్తున్న టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) లో కంపెనీ నేడు ఓ కొత్త ఆటోమేటిక్ వేరియంట్ ను విడుదల చేసింది.ఇక ఈ కొత్త ఆటోమేటిక్ వెర్షన్ ను టాటా కంపెనీ "టాటా ఆల్ట్రోజ్ డిసిఏ" (Tata Altroz DCA) పేరుతో ప్రవేశపెట్టింది.ఇండియన్ మార్కెట్లో ఈ కొత్త టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ వెర్షన్ ధర వచ్చేసి రూ.8.09 లక్షల నుండి ప్రారంభమై రూ.9.89 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకూ ఉంటుంది.ఇక టాటా ఆల్ట్రోజ్ డిసిఏ లో డిసిఏ అంటే డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ (Dual Clutch Automatic) అని అర్థం. ఇప్పటి వరకు కూడా టాటా ఆల్ట్రోజ్ కారు కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే దొరికేది. కాగా, ఇప్పుడు ఇది ఆటోమేటిక్ వెర్షన్ లో అందుబాటులోకి రావడంతో, ఈ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్ లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోరుకునే కస్టమర్ల కల కూడా నెరవేరనుంది. 


కొత్త Tata Altroz DCA ఆటోమేటిక్ వెర్షన్ ను కంపెనీ XM+ ఇంకా అలాగే XT, XZ, XZ+ అనే నాలుగు వేరియంట్లతో పాటుగా రెండు Dark Edition లలో కూడా విడుదల చేసింది.ఇక టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఆటోమేటిక్ వెర్షన్ కోసం కంపెనీ బుకింగ్ లను కూడా రిసీవ్ చేసుకుంటుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 21,000 టోకెన్ అడ్వాన్స్ పే చేసి కంపెనీ వెబ్‌సైట్ లో లేదా డీలర్‌షిప్ ‌ని విజిట్ చేసి ఈ కార్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నాటికి ఆల్ట్రోజ్ డిసిఏ కార్ డెలివరీలు కూడా స్టార్ట్ అవుతాయని భావిస్తున్నారు. టాటా మోటార్స్ ఈ ఆటోమేటిక్ కారును డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ ఇంకా అలాగే హార్బర్ బ్లూ కలర్ ఆప్షన్‌లతో పాటు కొత్తగా ఒపెరా బ్లూ కలర్ ఆప్షన్‌ లో కూడా తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: