ఈ మధ్య ఒక ఇంటర్వులో నందమూరి బాలకృష్ణ ఒక ప్రకటన చేసారు. మరో వారం రోజుల్లో నేను ఒక పాట పాడి దానిని విడుదల చేస్తున్నా అని పేర్కొన్నారు. చెప్పిన విధంగానే బాలకృష్ణ దానిని రేపు విడుదల చేయడానికి సిద్దమయ్యారు. రేపు సాయంత్రం ఆయన పాటను విడుదల చేయడానికి సిద్దమయ్యారు. రేపు సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు తాను పాటను విడుదల చేస్తున్నట్టు బాలయ్య పేర్కొన్నారు.
దీనిని నిర్మాత బిఏ రాజు ట్వీట్ చేసారు. తన 60వ జన్మదినం సందర్భంగా ఒక అపురూపమైన పాట తో ప్రేక్షకాభిమానులను అలరించబోతున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ని కూడా ఆయన విడుదల చేసారు.
తన 60వ జన్మదినం సందర్భంగా ఒక అపురూపమైన పాట తో ప్రేక్షకాభిమానులను అలరించబోతున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ #NandamuriBalakrishna #NBK60 #NBK pic.twitter.com/q9bPt7Q1WO
— BARaju (@baraju_SuperHit) June 8, 2020