ఈ మద్య ఏపిలో రాజకీయ రగడ ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలిసిందే.  ఓ వైపు కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పడు మంత్రులు, అధికారులతో సమీక్షలు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  కరోనా ఇబ్బందులు ఉన్నా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు కుంటు పడకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరస్తున్నారు.   తాజాగా రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు రాజకీయపరంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు.

 

 

జిల్లా అభివృద్ధి కోసం తాను శాయశక్తులా కృషి చేశానని చెప్పారు.  ముఖ్యమంత్రి ఏపి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నారని అన్నారు.   ముఖ్యమంత్రి జగన్ అన్ని కులాల అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. తనపై నమ్మకంతో రాజ్యసభకు పంపిస్తున్నారని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి అధిక నిధులను తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. 

 

రిజర్వేషన్ గల కులాలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతాన్ని కేటాయించిన ఘనత జగన్ కే చెల్లిందని కితాబిచ్చారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి జగన్ మాత్రం తగు ప్రాధాన్యతను ఇస్తున్నారని మోపిదేవి అన్నారు. కుల రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటని... అవసరాలకు కులాలను వాడుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: