మీరా చోప్రా తెలుగులో నాలుగైదు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ ఎందుకో బ్రేక్ మాత్రం దక్కలేదు.  మీరా చోప్రా అంటే ఎక్కువమంది సడెన్ గా గుర్తు పట్టలేరేమో కానీ పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా హీరోయిన్ అంటే మాత్రం గుర్తు పట్టే అవకాశం ఉంది.  ఆ సినిమా మాత్రమే కాదు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన  'వాన' లో కూడా మీరా హీరోయిన్ గానటించింది. అయితే తాజాగా మీరాచోప్రా ప్రభుత్వం పై ఫైర్ అయ్యింది.

కరోనావైరస్ కారణంగా సెల‌బ్రిటీలు మొద‌లుకొని సామాన్యుల వ‌ర‌కూ అంద‌రూ ప‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ అంటువ్యాధి కారణంగా అయిన‌వారిని కోల్పోయిన వారు త‌మ ఆవేద‌న‌ను సోష‌ల్ మీడియాలో తెలియ‌జేస్తున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోద‌రి మీరా చోప్రా త‌న ఆవేద‌న‌ను సోష‌ల్ మీడియాలో వెళ్ల‌గ‌క్కారు. హీరోయిన్ మీరా చోప్రా కరోనా కారణంగా పదిరోజుల వ్యవధిలో ఇద్దరు కజిన్స్‌ను కోల్పోయానని ట్వీట్ చేసింది. అయితే వారు కొవిడ్‌తో చనిపోలేదని.. కేవలం సరైన వైద్యసదుపాయం అందుబాటులో లేకపోవడం వల్లే మరణించారని ఆరోపించింది. ఫస్ట్ కజిన్‌కు బెంగళూరులో రెండు రోజుల వరకు ఐసీయూ బెడ్ దొరకక మరణిస్తే, మరొకరు ఆక్సిజన్ అందక చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ట్వీట్టర్ ఖాతాలో .."ఇది హృదయవిదారకం. ఇవి కోవిడ్ మరణాలు కాదని కొందరు అంటున్నారు. ఇవి వైద్య స‌దుపాల‌య లేమితో చోటుచేసుకుంటున్న‌ హత్యలు. ఆక్సిజన్ లేనందున ప్రజలు చనిపోతున్న ఏకైక దేశం మ‌న‌ది".. అంటూ ట్వీట్ చేసారు.ఇప్పుడు మీరా చోప్రా ట్వీట్ వైరల్‌గా మారింది.

 

మీరా చోప్రా కెరీర్ విషయానికి వస్తే.. ప్రియాంక చోప్రా సోదరిగా సినీ పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ అంతగా నిలదొక్కులేకోపోయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం దక్కిన ఆఫర్లను దక్కించుకోలేకోపొయింది. తెలుగులో బంగారం, వాన, మారో, గ్రీకు వీరుడు, మొగిలిపువ్వు లాంటి చిత్రాల్లో నటించింది. ఇంకా హిందీ చిత్రం సెక్షన్ 375, గ్యాంగ్స్ ఆఫ్ గోస్ట్స్ చిత్రాల్లోనూ, పలు తమిళ చిత్రాల్లో నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: