తెలంగాణ సి‌ఎం నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. ఉదయం హైద‌రాబాద్ బేగంపేట విమానాశ్ర‌యం నుంచి హెలికాప్ట‌ర్‌లో బయలుదేరి మద్యాహ్నన సమయానికి వరంగల్ చేరుకొనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి అక్కడి కరోనా రోగులను పరామర్శించి పరిస్థితులు అడిగి తెలుసుకొనున్నారు. వైద్యానికి సంబంధించిన వివరాలు, తదితర విషయాలను వైద్యులను తెలుసుకోనున్నారు. ఇక ఆ తరువాత సెంట్రల్ జైలును సందర్శిస్తారు. ఇక అక్కడి నుంచి తిరిగి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంత్ ఇంటికి వెళ్లనున్నారు. ఇక నిన్న సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలోని కోవిడ్ రోగులను సి‌ఎం కే‌సి‌ఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే .



మరింత సమాచారం తెలుసుకోండి: