క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో పేద‌ల‌కు అండ‌గా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ప‌ని చేస్తుంద‌ని మేనేజింగ్ ట్ర‌స్టీ నారా భువ‌నేశ్వ‌రి తెలిపారు.మ‌తం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ద‌ని...కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ సేవా కార్యక్రమాలు జ‌రుగుతున్నాయ‌న్నారు.ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై భువ‌నేశ్వ‌రి స‌మీక్ష జ‌రిపారు.నిపుణులైన వైద్యులతో ఆన్‌లైన్‌లో వైద్యసేవలు అందిస్తున్నామ‌ని...782 మందికి పైగా సేవలు అందించగా, 480 మంది కోలుకున‌ట్లు ఆమె తెలిపారు.ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచామ‌ని...24/7 కాల్ సెంటర్ తో అత్యవసర సమయంలో భరోసా క‌ల్పిస్తున్నామ‌న్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు 78వేల మందికి ఆహారం అందించామ‌ని...ఎన్టీఆర్ ట్రస్ట్ సేవావిభాగం ఆధ్వర్యంలో అనాధలకు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించిన‌ట్లు ఆమె తెలిపారు.మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామ‌ని నారా భువ‌నేశ్వ‌రి పేర్కోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: