ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌’ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ప్రారంభించారు. నేటి నుంచి ఈనెల 19 వరకు హుస్సేన్‌ సాగర్‌లో సెయిలింగ్‌ పోటీలు జరుగనున్నాయి. లేజర్‌ స్టాండర్డ్‌, లేజర్‌ రేడియల్‌, లేజర్‌ 4.7 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ మాట్లాడుతూ ముఖ్యమైన పని మీద ఢిల్లీ వెళ్లి, సైలింగ్ పోటీల ప్రారంభోత్సవానికి మిస్ అవ్వకూడదు అని వచ్చానని అన్నారు. గాలి ఏ దిక్కున ప్రయాణిస్తుందో తెలీదు... అలాంటి భారీ గాలిని అయినా తట్టుకుని తెర చాటు విన్యాసం చేస్తూ గమ్యం చేరుకోవడం ఒక్క సెయిలర్స్ కి మాత్రమే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. సెయిలింగ్‌ చేస్తున్న వారిని చూసి చాలా నేర్చుకోవాలన్న ఆమె వారిని చూసి మన జీవితం లో వచ్చే ఒడి దుడుకులను ఎదురుకోవాలని అన్నారు. యంగ్ సైలర్స్ కీ నా శుభాకాంక్షలు...లేజర్ సెయిలింగ్‌ ఆసియన్ గేమ్స్ లో పాల్గొంటున్న ప్రతి ఒకరికి అశీసులని ఆమె పేర్కొన్నారు. గోల్డ్ మెడలిస్ట్ నీరజ చోప్రా ను  చూసి ప్రతి స్పోర్ట్స్ పర్సన్ ఇన్స్పైర్ అవ్వాలన్న ఆమె నేత్ర కుమారన్, విష్ణు సర్వనన్ లాంటి మెడలిస్ట్,ప్రొఫెషనల్ శైలర్స్ ను చూసి సైలర్స్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: