
అవునండి... హైదరాబాదీలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ నుంచి వర్షం హెచ్చరిక జారీ అయింది. సుమారు నాలుగున్నర గంటల సమయంలో మరో రెండు గంటల పాటు సిటీ మొత్తం మీద భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డైరెక్టర్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలను హెచ్చరించారు. ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని ఈ హెచ్చరిక లో పేర్కొన్నారు. ఒక వేళ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కోసం Dial 040-29555500 నంబర్ కు కాల్ చేయాలని కూడా నెంబర్ కూడా సూచించారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షం కురుస్తోంది. వర్షం కురిస్తే హైదరాబాద్ రోడ్లు జలమయం అవుతాయన్న సంగతి తెలిసిందే. దీంతో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ సిద్ధంగా ఉన్నాయి.