
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్‌సింగ్ రాజీనామా చేయాలని అదే పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై వారు త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలవబోతున్నట్లు సమాచారం. రాజీనామాకు డిమాండ్ చేస్తున్నవారిలో నలుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ఉండటం గమనార్హం. వీరంతా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధూ అనుచరులుగా చెబుతున్నారు. కొంతకాలంగా సిద్ధూకు, ముఖ్యమంత్రికి విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మూడురోజుల క్రితం సిద్ధూ సలహాదారులు ఇద్దరు పాకిస్తాన్, కాశ్మీర్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు మరో వివాదాస్పదమైన ఇందిరాగాంధీ కార్టూన్ ను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించడంతోపాటు సమాధానం చెప్పాలంటూ వారికి నోటీసులు జారీచేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. త్వరలోనే అమరిందర్ రాజీనామా కోసం ఢిల్లీ పెద్దలను కలవబోతున్నట్లు తెలుస్తోంది.