హయత్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న ఘటన సంచలనం అయింది. ఇద్దరు యువకులను అడ్డుకున్న స్థానిక యువత పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని తరలిస్తున్న వారిని పోలీసులకు అప్పగించారు. హయత్ నగర్ లోని తొర్రూరు రోడ్డులో ఉన్న బాతుల చెరువు సమీపంలో ఘటన జరిగింది అని పోలీసులు తెలుస్తుంది.

మృతదేహాన్ని  ఓ బ్లాంకెట్ లో చుట్టి తీసుకెళుతున్నట్లు గమనించి నిలదీసిన యువకులు... పొంతన లేని సమాధానం చెప్పడంతో చితకబాది పోలీసులుకు అప్పగించారు. హత్య చేసి తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు స్థానికులు. ఇందులో వినోద్ అనే యువకుడు తనది లవ్ మ్యారేజ్ అని ఆమె తన బార్య అని చెప్పుకొస్తుండగా ఆమె ఎలా చనిపోయింది అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. మహిళ ఒంటిపై ఎలాంటి బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts