ఏపీ సీఎం జగన్ రైతులకు వరుసగా శుభవార్తలు చెబుతున్నారు. రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీపై ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 11న మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఈ నెల 16న రైతు భరోసా నిధులను విడుదల చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. జూన్‌ 15 లోగా రైతులకు పంట బీమా పరిహారం అందించాలని కూడా సీఎం జగన్ నిర్దేశించారు. జూన్ నెలలోనే 3వేల ట్రాక్టర్లు  పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే 4014 కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ సూచించారు. ఆర్బీకే, ఇ–క్రాపింగ్‌ అంశాలు చాలా ముఖ్యమైనవి అని వర్ణించిన సీఎం జగన్ వాటిని  పటిష్టంగా ఆమలు చేయాలని సూచించారు. ఖరీఫ్‌ సన్నద్ధత, కిసాన్‌ డ్రోన్లు, మిల్లెట్‌ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై కూడా సీఎం జగన్ సమగ్రంగా చర్చించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: