సంపన్నులు పేదల కోసం దానలు చేయడం సాధారణమే..కానీ ఆ దానం లక్షల్లో, కోట్లలో ఉంటే ఆశ్చర్యపోతాం.. దాన కర్ణుడు అని మెచ్చుకుంటాం..కానీ ఇప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన అదానీ.. దానంలోనూ తానే నెంబర్ వన్ అని నిరూపించుకున్నారు. తన సంపదలో ఏకంగా ఆయన 60 వేల కోట్ల రూపాయలు దానం చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నమ్మలేని నిజమే.


గౌతమ్‌ అదానీ తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ దానాన్ని ప్రకటించారు. రూ.60,000 కోట్లు ఆయన సమాజ సేవ కోసం  విరాళంగా ఇవ్వనున్నారు. అదానీ గ్రూప్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. గౌతమ్‌ అదానీ ఇవాళ 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. అదానీ తండ్రి శాంతిలాల్‌ అదానీ శత జయంతి కూడా ఈ సంవత్సరమే. అందుకే ఈ రెండు సందర్భాలను పురస్కకించుకుని గౌతమ్‌ అదానీ 60 వేల కోట్లు దానం చేయాలని నిర్ణయించుకున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: