పటేల్‌ను నెహ్రూ ఎదగనీయలేదని చరిత్రలో ఓ ఆరోపణ ఉంది. దీన్ని బీజేపీ ఇటీవల బాగా ప్రొజెక్ట్ చేస్తోంది. అయితే.. దేశంలో గుండు సూది తయారీని దశ నుంచి అంతరిక్షంలోకి రాకెట్ పంపించే స్థాయి వరకు భారత్ ఎదగడం వెనుక నెహ్రూ, గాంధీ కుటుంబం త్యాగం ఉందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్ అంటున్నారు. నెహ్రూ, పటేల్... మైత్రి నిర్ణయాలు సమిష్టిగా చేశారన్న మహేష్‌కుమార్‌ గౌడ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు.

బ్రిటిష్ నీతిని భాజపా అనుసరిస్తోందని.. భిన్న సంస్కృతుల నడుమ కలిసి మెలిసి ఉంటున్న ప్రజలను విడదీసి పాలించే ప్రయత్నం చేస్తోందని మహేష్‌కుమార్‌ గౌడ్ ధ్వజమెత్తారు. పటేల్ గొప్ప ప్రజా నాయకుడు... కాంగ్రెస్ పార్టీ నాయకుడు... 1981లో పుట్టిన భాజపాకు మాట్లాడే అర్హత లేదని మహేష్‌కుమార్‌ గౌడ్ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: