కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్లలో చేయని పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసులు ఎత్తివేయాలని యోచిస్తున్నారు. గతంలో కేసీఆర్‌ ఈ విషయంలో కొంత చేసినా ఇంకా కొందరిపై కేసులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసుల వివరాలను సీఐడీ అధికారులు సేకరిస్తున్నారు. కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు సీఐడీ అదనపు డీజీ పేరు మీద లేఖలు పంపించారు.  2009 డిసెంబర్ 9 నుంచి  2014 జూన్ 2వ తేదీ వరకు నమోదైన కేసుల వివరాలు నిర్దేశించిన నమూనాలో పంపించాలని ఈ లేఖలో అధికారులు సూచించారు.

ఉద్యమ సమయంలో అరెస్టై జైలుకు వెళ్లిన వాళ్ల వివరాలు పంపాలని అధికారులు కోరారు. ఈ వివరాలు పంపించాలని లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే సమయం వరకు ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: