ఏపీ సీఎం జగన్‌కు అంగన్వాడీలు షాక్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వారు ఇవాళ్టి నుంచి సమ్మెకు దిగనున్నారు. నిన్న అంగన్వాడీ సంఘాలు ప్రభుత్వం తో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మెకు వెళ్లాలని మూడు ప్రధాన సంఘాలు నిర్ణయించాయి. వేతనాలు పెంపు, గ్రాట్యుటీ తదితర డిమాండ్ ల పై అంగన్వాడిలు సమ్మెకు వెళ్తున్నారు.

ఇవాళ్టి నుంచి అన్ని అంగన్వాడి సెంటర్ ల మూసివేస్తామని అంగన్వాడీలు చెబుతున్నారు. అంగన్వాడీ సెంటర్లను మూసి వేసి ప్రాజెక్టు కార్యాలయాల వద్ద వారు ఆందోళనలు చేపట్టబోతున్నారు. ఓవైపు ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమ్మెలు జగన్‌ సర్కారును ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే సకాలంలో వేతనాలు అందడం లేదని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఇలా ఒక్కో వర్గం వారు సమ్మెలు చేసుకుంటూ పోతే అది ప్రభుత్వంపై నెగిటివ్ ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: