
ఈ క్రమంలోనే దారుణంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇవన్నీ చూసిన తర్వాత అసలు మనిషి ప్రాణాలకు విలువ లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరి మనసులో కలుగుతూ ఉంటుంది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిసిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు మరింత ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంత చిన్న కారణానికి కూడా మనిషి ప్రాణాలు తీసేస్తారా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఏకంగా కట్టుకున్న భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. అది కూడా ఒక చిన్న కారణానికే.
సరైన సమయానికి వంట చేయలేదు అన్న కారణంతో ఒక వ్యక్తి ఏకంగా భార్యను దారుణంగా కర్రతో కొట్టి చంపాడు అని చెప్పాలి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగులోకి వచ్చింది. బల్వా డైరీ ప్రాంతంలో టీ దుకాణం నడిపే బజరంగీ గుప్తా పని ముగించుకుని ఇంటికి వెళ్ళాడు. అయితే అతను ఇంటికి వెళ్లేసరికి భార్య అన్నం వండకపోవడంతో ఆమెతో గొడవకు దిగాడు. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక కోపంతో ఊగిపోయిన గుప్తా భార్యపై కర్రతో దాడి చేశాడు. ఆమె దెబ్బలు తాలలేక స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..