కావాల్సిన ప‌దార్థాలు:
మునగాకు- అరకప్పు
చింతపండు- కొద్దిగా
బెల్లం- అరచెంచా
ఉప్పు- తగినంత

 

క్యాప్సికం- రెండు
కొబ్బరి-చిన్నముక్క
ఎండుమిర్చి-నాలుగు

 

ఇంగువ- చిటికెడు
టమాటాలు- రెండు
పచ్చిమిర్చి-ఐదు

 

ఆవాలు- అరచెంచా
మెంతులు- పావు చెంచా
మినపప్పు- చెంచా

 

త‌యారీ విధానం: ముందుగా పాన్‌లో రెండు స్పూన్ల‌ నూనె వేడిచేసి మినపప్పు, ఆవాలు, మెంతులు వేయించి తరువాత ఎండుమిర్చి ఇంగువ‌ వేయాలి. రెండు నిమిషాల తర్వాత ఈ తాలింపుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మరో మూడు స్పూన్ల‌ నూనె వేడిచేసి, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, మునగాకు, చింతపండు, బెల్లం వేసి మగ్గించాలి. 

 

మునగాకులోని పచ్చివాసన పోయాక మ‌గ్గించి స్టౌ ఆప్ చేయాలి. ఇప్పుడు ముందుగా వేయించిన తాలింపు, తగినంత ఉప్పు, కొబ్బరి, మునగాకు మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని, మెత్తగా రుబ్బుకోవాలి. ఇక చివ‌రిగా ఈ మిశ్ర‌మానికి తాలింపు పెట్టుకుంటే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ మున‌గాకు పచ్చడి రెడీ..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: