ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..చాలా మంది తమ పని ఒత్తిడి వల్ల చాలా బాధపడుతుంటారు. ఆందోళన, మానసిక ఒత్తిడికి గురయ్యి తీవ్ర అవస్థకు గురవుతుంటారు. శంఖుపుష్పాల టీ, గులాబీ టీ ఇంకా గోంగూర పూల టీ వల్ల వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది.ఆందోళన, ఒత్తిడిని నియంత్రించి మానసిక ప్రశాంతతను కలిగిస్థాయి . శక్తిస్థాయులను పెంచుతాయి. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్థాయి.
శంఖుపుష్పాల టీ తయారీకి కావాల్సిన పదార్ధాలు...
శంఖుపుష్పాల రేకలు - అరకప్పు,
తేనె- టేబుల్‌స్పూన్,
నిమ్మచెక్క- ఒకటి,
నీళ్లు- రెండు కప్పులు.
శంఖుపుష్పాల టీ తయారీ విధానం...
నీళ్లను మరిగించి అందులో శంఖుపుష్పాల రేకలను వేయాలి. తక్కువ మంట మీద కాసేపు మరిగిస్తే రంగు దిగుతుంది. ఈ నీళ్లలో తేనె కలిపితే తేనీరు సిద్ధం అవుతుంది. తర్వాత నిమ్మరసం పిండుకుని వేడిగా తాగేయాలి. అలాగే కొబ్బరినీళ్లు, ఐస్‌క్యూబ్స్ వేసి దీన్ని చల్లగానూ తయారుచేసుకుని తాగొచ్చు.
గులాబీ టీ తయారు చేయు విధానం...
కావాల్సిన పదార్ధాలు...
ఎండిన గులాబీలు- మూడు,
గులాబీనీరు- టీస్పూన్,
తేనె- రెండు టేబుల్‌స్పూన్లు,
నిమ్మరసం- అర టీస్పూన్,
నీళ్లు- లీటర్,
గ్రీన్‌టీబ్యాగ్‌లు- రెండు
గులాబీ టీ తయారు చేయు విధానం...
పావు లీటరు నీటిని బాగా మరిగించి గులాబీరేకలు, నిమ్మరసం వేయాలి.దీన్ని స్టవ్ మీద నుంచి దించి ఎనిమిది నుంచి పది గంటలపాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల గులాబీరేకలు పూర్తిగా నానిపోతాయి. తర్వాత వాటిని వడకట్టేయాలి. దీంట్లో టీ బ్యాగులు వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత వాటిని తీసి తేనె, గులాబీనీరు వేసి బాగా కలపాలి. పాలతో కూడా దీన్ని తయారుచేయొచ్చు.
గోంగూర పూల టీకి కావాల్సిన పదార్ధాలు...
ఎండిన గోంగూరపూలు- ఆరు,
నీళ్లు- రెండు కప్పులు,
తేనె- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం : నీళ్లను బాగా మరిగించి దాంట్లో గోంగూరపూల రేకలను వేయాలి. స్టవ్ ఆపేసి గిన్నె మీద మూతపెట్టి ఐదు నిమిషాలపాటు అలాగే వదిలేయాలి. అప్పుడు పూలలోని సారమంతా నీళ్లలోకి దిగుతుంది. చివరగా తేనె కలిపితే సరిపోతుంది.
ఇక ఇలాంటి మరెన్నో కుకింగ్ రెసిపీస్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి